FbTelugu

రంజాన్ ప్రార్థనలపై ఆంక్షలు: అంజాద్ బాషా

కడప: రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో రంజాన్ నిర్వహణపై ఆంక్షలు విధించినట్లు ఏపి డిప్యూటీ సిఎం అంజాద్ బాషా తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధించినట్లు ఆయన చెప్పారు.

రంజాన్ పండుగ రోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు ఇంటి లోనే ప్రార్థనలు చేసుకోవాలి, బయటకు వచ్చి ప్రార్థనలు చేయకుండా చూడాలన్నారు. ఒక మసీదులో 50 మందికి మించి ప్రార్థనలకు హాజరు కావద్దని ఆయన స్పష్టం చేశారు. తప్పనిసరిగా ప్రార్థనలు సమయంలో కరోనా నిబంధనలు పాటించాలన్నారు, చిన్న పిల్లలు, వృద్ధులు, దగ్గు జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు ప్రార్ధనలకు రానేరావద్దని అంజాద్ బాషా స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.