FbTelugu

ఆగస్టు 25 నుంచి ఏపీ డిపార్ట్ మెంటల్ టెస్టులు

అమరావతి: డిపార్ట్ మెంటల్ పరీక్షల దరఖాస్తుకు తుది గడువు ఈ నెల 27 వరకు ఉంది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుంచి పరీక్షలు జరగనున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పదోన్నతుల అర్హతకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు తప్పనిసరి విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు శాఖా పరీక్షలు (డిపార్ట్మెంటల్) జరగనున్నాయి.

అయితే కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను పొందుపర్చారు.

You might also like