FbTelugu

మూడు నెలల్లో ఏపీ అప్పులు రూ.73వేల కోట్లు

అమరావతి: 3 నెలల్లోనే రూ.73,812కోట్లు అప్పులు చేశారని, అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

సిఎం వైఎస్.జగన్‌ అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. వైసిపి పాలనపై యనమల మీడియాతో మాట్లాడుతూ బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వాస్తవం కాదా? అని అడిగారు. కరోనా సమయంలో వచ్చిన విరాళాలన్నీ ఎటు పోయాయన్నారు. మూడు నెలల్లోనే రూ. 73,812కోట్లు అప్పు తెచ్చి, వాటిని సంక్షేమ పథకాలకు మళ్లించారన్నారు. పెన్షన్లు, జీతాలు, సంక్షేమం కోసం కూడా అప్పులు చేయాలా అని నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు డబ్బులు మాత్రం మాయమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల డిమాండ్‌ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.