FbTelugu

అమూల్ చేతికి ఏపి డెయిరీ అస్తులు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఏపి డెయిరీ ఆస్తులను అముల్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘాలు వద్ద ఉన్న ఆస్తులను నామమాత్రపు లీజుకు అమూల్ కు ఇవ్వాలని నిర్ణయించారు.
ఏపి డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కు చెందిన ఎంపిక చేసిన ఆస్తులను ఉత్పత్తి ఆధారిత లీజ్ అమౌంట్ గా అమూల్ కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం ఇక్కడి పాల సహకార సంఘాలను పటిష్టం చేసేందుకు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించంది. రాష్ట్రంలోని సహకార డెయిరీలను కాపాడేందుకు ఉత్పత్తి ఆధారిత లీజు మొత్తానికి అమూల్ కు అప్పగిస్తున్నట్లు ఏపి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.