FbTelugu

శ్రీవారిని దర్శించుకున్న ఏపి సిఎస్

తిరుమల: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఆదిత్య నాథ్ దాస్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరాహస్వామిని దర్శించుకున్నారు.
ఆ తరువాత కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆదిత్య నాథ్ దాస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆయనకు స్వామివారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందించారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయాల్సి ఉండగా పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు నెలల పాటు ఆదిత్య నాథ్ దాస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.