FbTelugu

ఏపీ కరోనా అప్డేట్స్

అమరావతి : రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,73,457 కి చేరింది. ఇవ్వాళ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.
తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,045 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ముగ్గురు కొవిడ్ తో మృతిచెందారు.

గడిచిన 24 గంటల్లో 785 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో గత 24గంటలలో పాజిటివ్ కేసులు సంఖ్య 618 నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,61,153 కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 5,259 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో 1,05,70,843 కరోనా నమూనాలు పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.