FbTelugu

విశాఖలో ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్

అమరావతి: విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కానుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగుకు ముందుకు వేసింది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది.

విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. విశాఖలో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‍కు కేటాయించిన రూ.13.80 కోట్లు విశాఖలో ఏర్పాటు చేసే కంట్రోల్‍ రూమ్‍కు బదలాయింపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.