FbTelugu

ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స: జగన్

అమరావతి: ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో 50 శాతం మంచాలు కరోనా రోగులకు కేటాయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీ కింద రిజిష్ట్రేషన్ అయిన హాస్పిటళ్లు అన్ని కూడా తప్పని సరిగా మంచాలు కేటాయించాలన్నారు. 50 శాతం మించి రోగులు వచ్చినా చేర్చుకోవాలని సిఎం ఆదేశించారు.

ఇవాళ తాడేపల్లిలో సిఎం జగన్ కరోనా నియంత్రణ, వ్యాక్సిన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కరోనా ఆసుపత్రి వద్ద కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని, రిజిష్టర్డు కాని ఆసుపత్రులలో కూడా కరోనా రోగులకు సేవలు అందించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. తగినంత ఆక్సిజన్, మందుల కోసం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి బోధనాసుపత్రిలో 10 కెఎల్, ఇతర ఆసుపత్రుల వద్ద 1కెఎల్ ఆక్సిజన్ నిల్వలుండేలా చూడాలని, కేంద్ర ప్రభుత్వ కేటాయింపులతో పాటు ప్రత్యామ్నాయాలను చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.