FbTelugu

సెటిలర్లతోనే నా బెంగ: సిఎం జగన్

తాడేపల్లి: తెలంగాణలో నివసిస్తున్న సెటిలర్లను ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో జల వివాదాలపై ఎక్కువగా మాట్లాడ్డం లేదని ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవాళ ఏపి మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపి, తెలంగాణ జల వివాదాలపై జగన్ మంత్రులతో మాట్లాడారు. ఏపి రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని జగన్ ప్రశ్నించారు. చుక్కనీరు కూడా వదిలే ప్రసక్తి లేదని, జల వివాదంపై కేంద్రానికి లేఖ రాయాలన్నారు. తెలంగాణ మంత్రులు దూకుడుగా మాట్లాడుతున్నారు, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జగన్ కోరారు. నదీ జలాల అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరోసారి లేఖ రాయాలని అధికారులను జగన్ ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.