FbTelugu

మంత్రి కొడాలి మీడియాతో మాట్లాడొచ్చు కాని…

అమరావతి: ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని)కి హైకోర్టులో ఊరట లభించింది. మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి మీడియాతో మాట్లాడవచ్చని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల కమిషన్ పై, ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగేలా వ్యాఖ్యానించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంతకు ముందు మంత్రి కొడాలి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ విమర్శలపై మనస్థాపం చెందిన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటీసులు జారీ చేయడం, ఆ తరువాత మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు. దీనిపై మంత్రి హైకోర్టును ఆశ్రయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.