FbTelugu

ప్రశ్నించిన వృద్ధురాలిపై ఏపీ సీఐడీ కేసు

విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్ దారుణ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన లక్ష్మీపురాని కు చెందిన పూందోట రంగనాయకమ్మ(60)పై ఏపీ సీఐడీ అధికారులు కేసు పెట్టారు.

ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టు పెట్టిందనే కారణంగా 60 ఏళ్ళ వృద్దురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద నమోదు చేసి నోటీసును అందజేశారు.

ఈ కేసు నేరం రుజువైతే  మూడేళ్ళు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. వృద్ధురాలిపై సీఐడీ అధికారుల కేసు నమోదుపై నగరవాసులు విస్మయం చెందుతున్నారు.

You might also like