అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్యలో ఏపీ తెలంగాణనే మించేసిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు.
కరోనాపై సీఎం జగన్ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజ్ భవన్ ఆరోగ్యశాఖ మంత్రి సిబ్బందికి కూడా కరోనా సోకిందన్నారు. కరోనాను జ్వరంతో పోల్చడం, మనతోపాటే కరోనా ఉంటుందనడం విచారకరమన్నారు. సీఎం పేషీలో కరోనా వస్తేగానీ ప్రమాదకరమైన వ్యాధి అని గుర్తించరా అని ప్రశ్నించారు.