FbTelugu

నేడు ఏపీ కేబినెట్ విస్తరణ

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ను విస్తరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 కి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖాళీ అయిన మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అప్పలరాజుకు స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1:00 గంటకు సీఎం జగన్ రాజ్ భవన్ చేరుకోనున్నారు.

You might also like