FbTelugu

కర్ఫ్యూ కఠినంగా అమలు: ఏపి క్యాబినెట్

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమంపై ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని, 45 ఏళ్లు పైబ‌డ్డ‌వారికి వ్యాక్సినేష‌న్‌లో తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి మండ‌లి తీర్మానం చేసింది. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుండి ఆక్సిజన్ తప్పించేందుకు ముమ్మర చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎలక్ట్రానిక్‌ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.

రైతు భరోసా కోసం రూ.3,030 కోట్లు, వైఎస్ఆర్ ఉచిత భీమా పథకానికి ఆమోదం తెలిపారు. రూ.2,589 కోట్లతో వైఎస్ఆర్ ఉచిత భీమా పథకం అమలు చేయనున్నారు. మత్స్యకారులకు రూ .10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు వైఎస్ఆర్‌ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం తెలుపుతూ మంత్రి మండ‌లి నిర్ణ‌యం తీసుకున్నది. .
రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ప్యూ అమలు చేయడంతో పాటు ప్రజారవాణా వాహనాలను, ఆర్టీసి, అంతర్రాష్ట్ర, దూరప్రాంత సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఉదయం 11:30 వరకే కళాశాల నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.