FbTelugu

రేపే ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: సీఎం జగన్ రెడ్డి అధ్యక్షతన రేపు మంత్రి మండలి సమావేశం కానుంది. మంత్రి మండలి భేటీపై ఈ నెల 9న సీఎస్ కార్యాలయం నోట్ పంపింది. ఇప్పటికే వివిధ శాఖలు కేబినేట్ అజెండాను ప్రభుత్వానికి పంపాయి.

కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ నిల్వలు, రెమిడిసివిర్, పడకలు, కొవిడ్ కేర్ సెంటర్లు, ఆంక్షలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం సచివాలయ మొదటి బ్లాక్‌లో జరపడంపై సందిగ్ధత ఏర్పడింది. కరోనా దృష్ట్యా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్‌ భేటీ జరిపే యోచనలో ప్రభుత్వం ఉంది. అది కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ జరిపనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.