FbTelugu

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఇవాళ ఏపీ మంత్రివర్గ భేటీ జరగనున్నది. ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారుపై చర్చిస్తారని చెబుతున్నారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టి పలు బిల్లులను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపైనా చర్చించి, ఏ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై ఒక తీర్మానం చేయనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఉధృతమవుతున్న ఉద్యమంపై ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.