FbTelugu

15న ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఈ నెల (జులై) 15న  ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.  ఈ భేటీ లో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు.  ఈ సమావేశం జులై 15న ఉదయం 11:00 గంటలకు సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చజరిపి నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన విషయాలపై ఈ నెల 13 సాయంత్రం 5:00 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.

You might also like