FbTelugu

రేపటి నుంచే ఏపీ బస్సులు ప్రారంభం

విజయవాడ: రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నామని, ఉదయం 7 గంటలకు తొలి సర్వీసు ఉంటుందని ఏపీ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు.

సిటీ బస్సు సర్వీసులు తరువాత ప్రారంభిస్తామని, అంతర్రాష్ట్ర సర్వీసులుపై నిషేధం ఉంటుందన్నారు. చార్జీలు పెంచడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది.. అయినా వేసవి కాలం దృష్టి లో పెట్టుకుని రాత్రి పూట బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణం చేయాలనుకునేవారు బస్ స్టాండ్ కి రాత్రి 7 లోపు చేరుకోవాలి.

నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతున్నాం. కాబట్టి 70% సర్వీసులు.. అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం. కన్సెషన్ పాసులకు లాక్ డౌన్ 4.0  పూర్తయ్యే వరకూ అనుమతి లేదని స్పష్టం చేశారు.

ప్రతీ బస్ స్టాండ్ లో శాని టైజర్స్ పెడుతున్నామని, అంత ప్రమాదం కానప్పటికీ క్యాష్ హాండలింగ్ కి కూడా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతాప్ వివరించారు. నగదు రహిత టికెట్ ఇష్యుకే మా ప్రాధాన్యత ఉంటుందన్నారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వేలెట్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు..10 ఏళ్ల లోపు పిల్లలను.. అత్యవసర మైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం.

ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. కానీ ప్రాయాణీకులకు దుప్పట్లు ఇవ్వడం లేదన్నారు.

You might also like