FbTelugu

అర్థగంటలోనే ఏపీ బడ్జెట్

అమరావతి: వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా రాష్ట్ర గవర్నర్‌ ఇవాళ ఉదయం 10 గంటలకు  ప్రసంగించనున్నారు.

గవర్నర్ ప్రసంగం తరువాత 11:30 గంటలకు స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరగనున్నది. బీఏసీ తరువాత సభ తిరిగి ప్రారంభమవుతుంది.  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలై, గవర్నర్‌ ప్రసంగంపై ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు.

మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బి.రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. సాధారణ బడ్జెట్‌ అనంతరం సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రతిపాదించనున్నారు.

శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ / పద్దును ప్రతిపాదించనున్నారు. 17వ తేదీ మధ్యాహ్నం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం  సాధారణ బడ్జెట్‌పై పరిమిత స్థాయిలో చర్చించనున్నారు. చర్చకు మంత్రి సమాధానాలు ఇచ్చిన తరువాత బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సభ వాయిదా వేయనున్నారు.

రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా 18 వ తేదీ అసెంబ్లీ / మండలి సమావేశాలు ఉండవు. 19 వ తేదీ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ, లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉండనున్నాయి.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.