FbTelugu

ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టారు.

అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అంటూ ప్రసంగం బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

రూ.2.25 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు.

 

ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు…

ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు
సవరించిన అంచనాలు 2019-20
సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం​.

 

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు…
వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
పశుగాణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు​​​​​​​
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు.

 

వివిధ పథకాలకు కేటాయింపులు

గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు

రియల్‌ టైం గనర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు

వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు

104, 108 లకు రూ.470.29 కోట్లు

డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు

వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు.

You might also like