FbTelugu

19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను ఆమోదించా లని రాష్ట్రం ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్నది. మరో వైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ సిద్ధమవుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.