FbTelugu

వాడీ వేడీగా ఏపీ అసెంబ్లీ షురూ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైనాయి. అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. సభ ప్రారంభంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాప తీర్మానాలను ఆమోదం తెలిపింది. నెల్లూరులోని మ్యూజిక్‌, డాన్స్‌ ప్రభుత్వ పాఠశాలను డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్‌, డాన్స్‌ పాఠశాలగా మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఇవాళ 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటూ జరగనున్నాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో..10 రోజుల పాటూ సభ జరపాలని టీడీపీ నేత అచ్చెనాయుడు డిమాండ్ చేశారు. సభలో 70 ఏళ్లు దాటిన సభ్యులు ఉన్నందువలన అధికారులు కరోనాకు భయపడుతున్నట్టు మంత్రులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.