FbTelugu

స్వరాష్ట్రానికి పంపించాలి: షర్మిలకు హోంగార్డుల వినతి

హైదరాబాద్: తమ స్వస్థలం అయిన ఏపీ రాష్ట్రానికి పంపించేలా సీఎం జగన్ రెడ్డితో మాట్లాడాలని తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ప్రాంతం హోం గార్డులు వైఎస్.షర్మిలకు వినతి పత్రం అందచేశారు.

రాష్ట్ర విభజన తరువాత తాము తెలంగాణలో పనిచేస్తున్నామని, ఇప్పటికీ తమను స్థానికేతరులుగానే గుర్తిస్తున్నారని వారు ఆమె ముందు వాపోయారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్ లో షర్మిలను ఏపీ ప్రాంత హోం గార్డులు ఆమెను కలిశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా తమకు ఆఫ్షన్లు ఇవ్వలేదన్నారు. అందువల్లే తాము ఇక్కడ పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతరులుగా ఇక్కడ ఉండే బదులు తమ స్వరాష్ట్రం ఏపీకి వెళ్లిపోతామని వారు గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఏపీలో విధుల్లోకి తీసుకునేలా సీఎం జగన్‌తో మాట్లాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.