FbTelugu

ఉరేసుకొని ఏఓ ఆత్మహత్య

చిత్తూరు : అగ్రికల్చర్ ఆఫీసర్(ఏఓ) తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సోమలలో కార్పొరేషన్ బ్యాంక్లో అగ్రికల్చర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పంకజ్ బీసీన్(32) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మధ్యప్రదేశ్ లోని బాలాగ్ హాట్ జిల్లా తెలిసిల్లాల్ బర్రా గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

2019లో అనంతపురం జిల్లాలో ఉద్యోగంలో చేరినట్టు గుర్తించారు. పంకజ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకాతెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.