FbTelugu

నదిలో దూకి ఏఓ ఆత్మహత్య

సంగారెడ్డి: కుటుంబ కలహాలో, అధికారుల వేధింపులో తెలియదు కాని అగ్రికల్చర్ ఆఫీసర్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు తెలియరాలేదు.

మానూరు డలం రావిపల్లి బ్రిడ్జీపై నుంచి వ్యవసాయ అధికారి (ఏఓ) అరుణ మంజీరా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా రైతు శిక్షణా కేంద్రంలో ఏఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటుగా వెళ్తున్న వారు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు నెంబర్ ఆధారంగా, అందులో లభించిన డాక్యుమెంట్ల చూసిన అరుణ గా నిర్థారణకు వచ్చారు. వెంటనే ఈ సమాచారాన్ని పై అధికారులకు తెలియచేశారు.
అరుణ మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆత్మహత్య ఏ కారణం చేసుకుందనేది తెలియడం లేదు. ప్రభుత్వ అధికారి ఆత్మహత్య చేసుకోవడం జిల్లా యంత్రాంగంలో కలకలంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.