FbTelugu

బ్యాలెట్ పేపర్ పై పెన్నుతో గీకినా లెక్కించాలి

అర్థరాత్రి ఎన్నికల సంఘం ఆదేశాలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ బ్యాలెట్ పేపర్ లో స్వస్తిక్ మార్క్ తో పాటు ఏ మార్కు పెట్టినా, పెన్నుతో గీకినా లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేసింది.

జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు జారీ చేసిన ఈ ఆదేశాలపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం అర్థరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇవాళ ఉదయం ఒకరు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం బరితెగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ మార్కుతో పాటు పెన్నుతో గీసినా, ఏ మార్కు పెట్టినా లెక్కించాలని ఆదేశాలు జారీ చేయడం చట్ట వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక ఉత్తర్వులను అర్థరాత్రి జారీచేస్తారా ఆయన ప్రశ్నించారు. ఈ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానం ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు. 17 ఏళ్ల కుర్రాడినికి ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారిగా నియమించారని సంజయ్ ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.