FbTelugu

రూ.2కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన

కర్నూలు: అమ్మోనియా గ్యాస్ లీకేజీతో ఓ వ్యక్తి చనిపోవడంతో తమకు న్యాయం కావాలంటూ.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకెళితే.. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి గ్యా్స్ ప్రభావానికి గురై మృతి చెందాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ.. మృతుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. రూ.30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

You might also like