FbTelugu

బిగ్‌బాస్‌లో గంగవ్వకు బెంగ.. అస్వస్థత..

హైదరాబాద్: తనను బయటకు పంపిస్తారనే బెంగ గంగవ్వకు పట్టుకున్నట్లుంది. దీంతో ఆమె తను బయటకు వెళ్లడం ఖాయం అని భావించడంతో స్వల్ప అస్వస్థతకు గురైంది.

ఆమెను కన్ఫషన్ రూమ్ కు పిలిపించి నీ ఆరోగ్యంపై దిగులు వద్దు, త్వరగా కోలుకుంటారని బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున చెప్పి పంపించారు. తనను బాగా చూసుకొంటున్నారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని గంగవ్వ తెలిపింది. ఈ వాతావరణం పడటం లేదు అంటూ గంగవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తండ్రి, భర్త, నాకంటూ ఎవరూ లేరు అంటూ ఏడ్చింది. కాళ్లలో నొప్పులు ఉంటాయి.

ఆరోగ్యం నాకు సరిగా ఉండటం లేదు అని చెప్పగా, ఇక్కడి వచ్చిన వారందరికి కొత్తలో ఇలానే ఉంటుందని తెలిపారు. సమయానికి మందులు వేసుకోండి. డాక్టర్లు మీ ఆరోగ్యాన్ని చూసుకొంటారని సముదాయించారు. మీరు నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లండి అంటే సరే అని గంగవ్వ వెళ్లింది. లాస్య సహాయంతో గంగవ్వ డాక్టర్ రూమ్‌కు వెళ్లింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.