FbTelugu

‘అనుష్క వల్లనే నాలో సహనం పెరిగింది’

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమని అనుష్క శర్మ గురించి పలు విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అనుష్క శర్మ తన జీవితంలోకి వచ్చినప్పటినుంచే తనలో సహనం పెరిగిందని తెలిపారు.

అంతకి ముందు తనకు అమితమైన కోపం ఉండేదని ఇప్పుడు మాత్రం లేదని తెలిపాడు. తనలో ఎన్నో మార్పులకు అనుష్క కారణమైందని, తాను జీవితంలోకి వచ్చాక గతంలో ఎప్పుడూ లేనంత సహనం, ఓపిక పెరిగిందని తెలిపాడు. దేశంలో లాక్ డౌన్ కారణంగా ఈ జంట ఇంటికే పరిమితమైనారు. నిత్యం ఏదో ఒక ఈవెంట్ చేస్తూ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.

You might also like