FbTelugu

టైం, ప్లేస్ మీరు చెప్తారా.. మమ్మల్ని చెప్పమంటారా?: అనురాధ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్దమా? టైం, ప్లేస్ మీరు చెబుతారా? మమ్మల్ని చెప్పమంటారా? అంటూ.. టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ రాష్ట్రం మొత్తం మీద 2,75,117 ఎకరాలను జగన్ స్వాహా చేసి 16,97,335 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని 8 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, 16 నెలలు జైలు శిక్ష అనుభవించారన్నారు. జగన్ 43వేల కోట్లు ఆస్తులు జప్తు చేశారని అన్నారు. అత్యున్నత న్యాయస్థానాలు సైతం జగన్ చేసిన అక్రమార్జన చూసి ఆశ్చర్యపోయాయని అన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడుని ఎక్కువ కాలం భయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సాక్షాత్తు సీబీఐ కోర్టు వ్యాఖ్యానించడం సిగ్గు చేటని,
తాజాగా 87% వైకాపా నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. వారి మీద అవినీతి కేసులన్నాయని తమ మీద కూడా అవినీతి మరకలు రుద్దే ప్రయత్నం వైకాపా చేస్తోందన్నారు. ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైకాపా నాయకులు డప్పులు కొట్టుకుంటున్నారని. వాటికి తమకు ఏ సంబంధం ఉందని ప్రశ్నించారు. 38 వారాల నుంచి జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా కుంటి సాకులు చెబుతున్నారన్నారు. ఈ రోజు కూడా జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అమిత్ షాను కలవాలంటూ ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై 26 ఎంక్వైరీలు వేసినా ఏం చేయలేకపోయారన్నారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తులను క్రమం తప్పకుండా ప్రతి యేడాది ప్రకటిస్తున్నారని తెలిపారు. జగన్ కు దమ్ముంటే తన ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More