FbTelugu

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు.. వైద్యునిపై సస్సెన్షన్ !

విశాఖ: ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో ఓ వైద్యునిపై సస్సెన్షన్ వేటు పడింది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆ ఆస్పత్రిలో
కనీస సౌకర్యాలు కూడా లేవంటూ.. ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారని దూషించాడు.

దీంతో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషన్ ఆ వైద్యునిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో.. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించిన కారణంగా, 144 సెక్షన్ ఉల్లంఘన వంటి చర్యలతో అతనిపై సస్పెన్షన్ వేటు వేయనున్నట్టు సమాచారం.

You might also like