FbTelugu

సిద్ధమైన అంతర్వేది కొత్త రథం

తూ.గో.జిల్లా: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొత్త రథం రూపుదిద్దుకున్నది.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.

గతేడాది కొందరు దుండగులు సెప్టెంబర్ 5 వ తేదీన అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ, టీడీపీ పార్టీలు ఉద్యమించాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ప్రతిపక్షాల డిమాండ్ తో జగన్ ప్రభుత్వం సిబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

దగ్ధమైన రథానికి దేవాదాయ శాఖ రూ.84 లక్షల బీమా చేయించింది. అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చింది. కొత్త రథం ఎత్తు 41 అడుగులు, ఆరు చక్రాలతో ఏడు అంతస్తులుగా తయారు చేశారు.

 

East Godavari district

You might also like

Leave A Reply

Your email address will not be published.