FbTelugu

హెరిటేజి ‘కరోనా’ పై సమాధానం చెప్పాలి

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

హైదరాబాద్: ఉప్పల్ హెరిటేజ్ ఫ్యాక్టరీ లో కరోనా కలకలంపై చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు విప్పడం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.

ఈ విషయంపై బయటకు వచ్చి ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పడం లేదని ఆయన అడిగారు. హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో కొంతమందికి కరోనా వైరస్ సోకిందని.. వారందరినీ క్వారంటైన్ కు పంపారన్నది వాస్తవమా..? కాదా..?.

దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి రోజూ సలహాలు ఇచ్చే చంద్రబాబు, ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బందికి కరోనా వైరస్ సోకడం వల్ల ఆందోళనలకు గురి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పరని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.