FbTelugu

క‌రోనా మించిన మ‌రో వైర‌స్‌!

బ‌ర్డ్‌ఫ్లూ… ఎబోలా.. జికా.. ఇలా ఎన్నో వైర‌స్‌లు ప్ర‌పంచాన్ని భ‌య‌కంపితుల‌ను చేశాయి. స్వైన్‌ఫ్లూ అయితే నిద్ర‌ప‌ట్ట‌కుండా చేసింది. ఇప్పుడు క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌పంచ‌దేశాల‌న్నీ క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నాయి. ఏ వైపు నుంచి ఎలా దాడి చేస్తుంద‌నేది తెలియ‌కుండా బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు ప్ర‌జ‌లు. చివ‌ర‌కు ఇష్టంగా తినే నాన్‌వెజ్ వంట‌కాలంటే భ‌య‌ప‌డేంత‌గా మారారు. ఈ దెబ్బ‌కు హోటల్స్‌, రెస్టారెంట్లు మూత‌ప‌డే ప‌రిస్థితికి చేరాయి. కాయ‌గూర‌లు, పండ్ల‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. చైనా పేరు వింటే హ‌డ‌లెత్తుతున్నారు. ఇప్ప‌టికే సుమారు 1200 మంది మ‌ర‌ణించార‌ని అంచ‌నా. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ప్ర‌క‌టించింది. ఏపీలో అయితే కోళ్లు కోయ‌కండ్రా బాబూ అంటూ మంత్రులు చికెన్ సెంట‌ర్ల చుట్టూ తిరిగి మ‌రీ ప్రాధేయ‌ప‌డుతున్నారు. ఇటువంటి స‌మ‌యంలో మ‌రో వైర‌స్ సైర‌న్ మోగిస్తుంది. ఇప్ప‌టికీ అది ప్ర‌మాద‌క‌రం గాకపోయినా మున్ముందు దీని తీవ్ర‌త ఎలా ఉండ‌బోతుంద‌నేది మాత్రం అంచ‌నా వేయ‌టం క‌ష్ట‌మ‌నేది వైద్య‌నిపుణుల ఆందోళ‌న‌. అదే యారా వైరస్. బ్రెజిల్‌లోని బెలో హోరిజోంటే అనే ఆర్టిఫిషియ‌ల్ లేక్‌లో బ‌య‌ట‌ప‌డింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ వైర‌స్ ఎవ‌రికీ సోక‌లేదు. కానీ.. దీని ప్ర‌భావం మాత్రం క‌రోనాను మించి ఉంటుంద‌నే అభిప్రాయం మాత్రం వైద్య‌వ‌ర్గాల నుంచి వినిపిస్తుంది. దీన్ని క‌ట్ట‌డి చేసేందుకు బ్రెజిల్ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంద‌ట. అయితే ఇది గాలి, నీరు ద్వారా ఎలా వ్యాపిస్తుంది.. నిజంగానే దీనికి అంత‌టి శ‌క్తి ఉందా! అనే విష‌యాల‌పై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని బ్రెజిల్ చెబుతోంది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More