FbTelugu

ఆన్ లైన్ గేమ్ కు మరొకరు బలి

హైదరాబాద్: ఆన్ లైన్ గేములో గెలుపొంది అప్పులు తీర్చాలని ఆశపడిన ఒక యువకుడికి మరణమే దిక్కయ్యింది. ఆన్ లైన్ గేమ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఆడి ఓటమి పాలైన ఒక యువకుడు బలవన్మరణం చెందాడు.

వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదీశ్ (34) పాథాలజీ ల్యాబ్ నిర్వహిస్తున్నడు. ఇలా వచ్చిన డబ్బులను ఆన్ లైన్ గేముల కోసం వెచ్చించేవాడు. గతంలో ఇలాగే రూ.12 లక్షలు నష్టపోవడంతో, వాటిని తండ్రి తీర్చాడు. కొద్దిరోజులుగా మళ్ళీ ఆన్ లైన్ గేములు ఆడుతూ రూ.15 లక్షలు నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారు చెల్లించాలని వెంటపడడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకునే ముందు ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.