FbTelugu

యూపీలో మరో మంత్రి చేతన్ చౌహాన్ మృతి

గుర్గాంవ్: కరోనా పాజిటివ్ తో పోరాడిన మాజీ క్రికెటర్, యూపీ క్యాబినెట్ మంత్రి చేతన్ చౌహాన్ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. ఆగస్టు 2వ తేదీన సాంకేతిక శాఖ మంరి కమలారాణి వరుణ్ చనిపోగా, తాజాగా చౌహన్ చనిపోయారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సైనిక సంక్షేమం, పౌర భద్రత, ప్రాంతీయ రక్షాదళ్ మంత్రిగా ఉన్నారు. తొలుత లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో మేదాంత హాస్పిటల్ కు తరలించారు. ఆరోగ్యం విషమించిందని రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. వెంటి లేటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయన తుది శ్వాస విడిచారు. చౌహాన్ మృతిపై సీఎం యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
1970 దశకంలో చౌహాన్ ఇండియా టీమ్ లో కీలకంగా వ్యవహరించారు. 1981 లో అర్జున అవార్డు అందుకున్న ఆయన అమ్రోహీ నుంచి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

You might also like