FbTelugu

కీర్తి కేసులో మరో ట్వస్ట్..

another-twist-in-keerthi-case

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హయత్‌నగర్ కీర్తి కేసులో మరో ట్వస్ట్ చోటుచేసుకుంది. కీర్తి ఇద్దరు ప్రియులపై కేసు నమోదు కాగా కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి మాత్రం జైలులో లేడట. బాల్‌రెడ్డి, శశికుమార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నిందితురాలు కీర్తిని చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు శశికుమార్, బాల్‌రెడ్డిలను చర్లపల్లి జైలుకు తరలించినట్టు చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా.. చర్లపల్లి జైలుకు ఒక్క శశికుమార్ మాత్రమే వచ్చాడని, బాల్‌రెడ్డి విషయం తమకు తెలియదని జైలు సిబ్బంది తెలిపారు. బాల్ రెడ్డిని జైలుకు తీసుకొస్తున్నట్టు తమకు సమాచారం లేదని జైలు సిబ్బంది స్పష్టం చేశారట. ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

You might also like