FbTelugu

ధాన్యం లారీని ఢీకొన్న మరో లారీ

పశ్చిమగోదావరి : ఆగి ఉన్న ధాన్యం లారీని మరో లారీ ఢీకొని తృటిలో ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలతో బయటపడిన ఘటన జిల్లాలోని భీముడూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ లారీ ధాన్యం లోడుతో ఏలూరు వెళుతుండగా టైర్ పంక్షర్ అయింది.

దీంతో డ్రైవర్ లారీని రోడ్డుపక్కన ఆపాడు. అదే క్రమంలో వెనుకనుంచి వేగంగా వచ్చిన మరో లారీ బలంగా ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలలో ఉన్న ఇద్దరు డ్రైవర్లూ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ధాన్యం బస్తాలు మొత్తం కిందపడిపోయాయి. ఢీకొట్టిన లారీ బురదలో కూరుకుపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.