FbTelugu

మాగంటి బాబు కు మరో విషాదం

హైదరాబాద్: ఆంధ్రాకు చెందిన ఏలూరు మాజీ ఎంపి మాగంటి వేంకటేశ్వర రావు అలియాస్ బాబు రెండవ కుమారుడు మాగంటి దామోదర రవీంద్రనాథ్ చౌదరి (32) రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు.

ఈ ఏడాది మార్చి నెలలో మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ చనిపోగా, తాజాగా రెండో కుమారుడు రవీంద్రనాథ్ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. విపరీతమైన తాగుడు అలవాటు, డ్రగ్స్ వినియోగం నుంచి తప్పించడానికి తల్లిదండ్రులు కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కోకాపేటలో నివసిస్తున్న రవీంద్రనాథ్ గత నెల 28న బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో చేరాడు. లివర్ స్కిరోసిస్ సమస్య ఉండడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నాడు. మంగళవారం సాయంత్ర ఖాళీ చేయాల్సి ఉండగా చేయకపోవడంతో హోటల్ సిబ్బంది వెళ్లి రూమ్ తలుపు తట్టగా అలికిడి లేకోపవడంతో మేనేజర్ కు తెలిపారు. ఆయన వచ్చి గది తెరిచి చూడగా రవీంద్రనాథ్ బాత్రూమ్ లో నిర్జీవంగా కన్పించాడు. అతని నోట్లో నుంచి రక్తం కారుతుండడంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కథనం కూడా విన్పిస్తున్నది. ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఉంటున్నాడంటున్నారు. రవీంద్రనాథ్ చౌదరి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు పోలీసులు చెప్పారు. మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ ఈ ఏడాది మార్చి మొదటి వారంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.