FbTelugu

వేలేరుపాడులో మరో పులి కలకలం

పశ్చిమ గోదావరి: గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పులుల గాండ్రింపులు ఎక్కువైనాయి. తాజాగా పశ్చిమగోదావరిలోని వేలేరుపాడు అటవీ ప్రాంతంలో ఓ పులి సంచరిస్తూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఆ ప్రాంతంలోని గుండ్లమడుగుకు పశువులను మేపడానికి కాపరులు వెళ్లగా.. పశువులపై దాడిచేసినట్టుగా పశువుల కాపరులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.