FbTelugu

మరో మూడు నెలలు..?

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది. దీనికి కొద్దిపాటి మినహాయింపులు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ రంగాలకు ఈ మినహాయింపులను ఆ రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.

అయినా, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్న కారణంతో ఒకపక్క జాగ్రత్తలు తీసుకుంటూనే లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్నారు. అన్ని రంగాలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో బ్యాంకింగ్‌ దిగ్గజమైన ఎస్‌బీఐ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.

అదే బ్యాంకు రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. మరో మూడు నెలలు మారటోరియం విధించాలని ఆర్బీఐకు ఆ బ్యాంకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఆర్బీఐ పరిశీలిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యక్తులు, సంస్థలు తీవ్రంగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారని, అందుకే మారటోరియం కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది.

ఇప్పుడు లాక్‌డౌన్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినా రుణాలు వెంటనే చెల్లించే శక్తి ఉండదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. అయితే, మూడు నెలల మారటోరియాన్ని ఎంచుకోవాలనుకుంటే మాత్రం ఖాతాదారులు దానిపై బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని.. లేకుంటే మీ ఖాతాలో ఉన్న డబ్బు డెబిట్‌ అవుతూనే ఉంటుందని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.