ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో మరో వింత వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏలూరులో వింత వ్యాధి తీవ్ర కలకలం రేపి అనేక మంది ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కాగా తాజాగా జిల్లాలోని భీమడోలు మండలంలో మరో వింత వ్యాధి కలకలం రేగింది. స్థానిక పూళ్ల గ్రామంలోని 16మంది ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు.
గతంలో చోటుచేసుకున్న ఏలూరు ఘటనను తలపించింది. అప్రమత్తమైన అధికారులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారం వలన ఇలా జరిగి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు. ఫలితాలు రావాల్సి ఉంది.