FbTelugu

పొంచి ఉన్న మరో తుఫాను

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నివర్ తుఫాన్ ప్రభావంతో భారీగానే వర్షాలు కురిశాయి. తాజాగా మరో తుఫాన్ పొంచి ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తుఫాను ఇప్పటికే తీవ్ర పంటనష్టాన్ని మిగిల్చింది. తాజాగా ఏర్పడనున్న తుఫాను ప్రభావంతో నేటి (ఆదివారం) నుంచే తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రానున్న వారం రోజుల పాటూ.. దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.