FbTelugu

ఈటలకు మరో షాకిచ్చిన కెసిఆర్

హైదరాబాద్: ఈటల రాజేందర్ పై వేటు వేసేందుకు దాదాపు సిద్ధమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇవాళ మరో అడుగు వేశారు. రాజేందర్ నుంచి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలను తొలగించారు.
ఈ మేరకు రాజ భవన్ అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించింది. ఇక నుంచి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను సిఎం కెసిఆర్ పర్యవేక్షిస్తారని ప్రకటించింది. సిఎం కెసిఆర్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.