FbTelugu

టీడీపీకి మరో ఎదురుదెబ్బ

Another-setback-for-TDP

తెలంగాణలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఏలేటి అన్నపూర్ణమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శనివారం రాజీనామా లేఖను పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో ప్రకటించారు. అలాగే ఆమె బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో ఆమె కుమారుడు మల్లికార్జున్ రెడ్డితో కలిసి శనివారం సాయంత్రం బీజేపీలో చేరనున్నారు.

You might also like