FbTelugu

గొర్రెల పంపిణీకి మరో రూ.6వేల కోట్లు: కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకానికి మరో రూ.6వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ లో వృత్తి కులాలైన బిసి వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్ లో మంగళవారం సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ను కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ.5000 కోట్ల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు. మొదటి విడత తో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమ లకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా రూ.11,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సిఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సిఎం అధికారులను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.