FbTelugu

రైతుల ఖాతాలోకి మరో రూ.2వేల జమ

ఢిల్లీ: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందిస్తున్న డబ్బులను మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

ప్రధాన మంత్రి మోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి ఏడాదికి రూ.6వేల చొప్పున అందచేస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు.

ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులైన మంజూరు చేయనున్నది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో..లేదో తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లో చూసుకునే వెసులుబాటు ఉంది. వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ టైప్ చేసి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించారు.

You might also like