FbTelugu

ఆర్టీసీకి మరో ప్రమాదం

Another-risk-to-telangana-RTC-

తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు అందరి చూపూ దానిపైనే. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేస్తున్నారని.. దానిని కాపాడుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల పోరాటం ఒకవైపు.. చత్‌.. మాకే వ్యతిరేకంగా మాట్లాడతారా.. సమ్మెకు దిగి సవాల్‌ చేస్తారా.. అసలు ఆర్టీసీ వ్యవస్థనే లేకుండా చేస్తా.. ఇక మీ ఉద్యోగాలు ఊడినయ్‌ అని చెప్పే సర్కారు ఒకవైపు.. రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వకున్నా.. దసరా, దీపావళి పండగలకు దూరమైనా.. తమ డిమాండ్లకు తలొగ్గేది లేదని మొక్కవోని దీక్షతో సమరశంఖం పూరించిన ఆర్టీసీ కార్మికులు మరోవైపు. ఆర్టీసీ సమస్యపై తప్పుడు సమాచారం ఇచ్చి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తారా అని ప్రభుత్వాన్ని తలంటుతున్న హైకోర్టు ఇంకోవైపు… బస్సులు లేక.. ప్రైవేటు వాహనాల దోపిడీకి గురవుతున్న ప్రజానీకం మరోవైపు. ఇలా ఆర్టీసీ ఉద్యమం సకల జనుల మద్దతుతో నెల రోజులుగా సాగుతోంది. ఇప్పటికే ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంది. సమ్మెతో ఆదాయం తగ్గి ఇంకా మరింత నష్టాల్లో కూరుకుపోతోంది. ఆర్టీసీని ఇక ఎవడూ కాపాడలేడు అని సాక్షాత్తూ సీఎం ప్రకటించడం ఒకింత విడ్డూరం కలిగించింది. ఇలాంటి సంఘటనలు, ప్రకటనలతో రోజూ అందరి నోళ్లలో నానుతున్న ఆర్టీసీకి మరో గండం వచ్చి పడింది.

You might also like