హైదరాబాద్: తెలంగాణ లో రానున్న మూడు రోజుల పాటూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఏపీలో రానున్న రెండ్రోలు తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.
జార్ఖండ్ పై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు తెలిపింది. కోస్తాంధ్రలో రుతుపవనాలు కాస్త చురుగ్గానే కదులుతున్నప్పటికీ, రాయలసీమలో కాస్త నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు సాధారణంగా కదులుతున్నట్టు తెలిపింది.