FbTelugu

ముకేశ్ అంబానీ కేసులో మరో పోలీసు అరెస్టు

ముంబయి: ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం పెట్టిన కేసులో అరెస్టయిన ముంబై పోలీసు అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ సచిన్ వాజేకు సహకరించిన మరో పోలీసును ఎన్ఐఏ అరెస్టు చేసింది.
అరెస్టయిన రియాజ్ కాజీ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ లో సచిన్ వాజేతో కలిసి పనిచేశారు. పేలుడు పదార్థాలు పెట్టిన కారు యజమాని మన్ సుఖ్ హిరేన్ ఆ తరువాత ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఆయన ఆత్మహత్య కాదని హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో మహారాష్ట్ర హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. మరో ఇద్దరు మంత్రులపై ఆరోపణలు రావడం తెలిసిందే. హోం మంత్రిపై రెండు వారాల్లో విచారించి ఛార్జి షీట్ దాఖలు చేయాలని ముంబయి హైకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేసుకు సంబంధం ఉన్న అసిస్టెంట్ పోలీసు ఇన్ స్పెక్టర్ రియాజ్ కాజీని అరెస్టు చేయడంతో మరిన్ని కోణాలు వెలుగు చూస్తాయంటున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తో పాటు 40 మందిని విచారించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.